సినిమాలో విలనిజం ఎంతగా పండిస్తే అతనికి విలన్ గా అంత గుర్తింపు వస్తుంది. కాని అదే విలనిజం నిజం జీవితంలో చూపెట్టాలి అని అనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది.
వివరాల్లోకి వెళితే, తెలుగు సినిమాల్లో నటించే హాస్యనటుడు అయిన డీవీ నాయుడు ఇంటి పైన రాము అనే వ్యక్తి తన గ్యాంగ్ తో సహా వచ్చి దాడి చేశాడట. ఈ రాము అనే వ్యక్తి హీరో రానా కొత్త చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో విలన్ గా చేశాడు.
ఇక బాధితుడైన డీవీ నాయుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.