ఆమె ఓ కథానాయకుడి కుమార్తె. సినీ రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఒకట్రెండు చిత్రాలు పట్టాలెక్కాయి కూడా. అయితే.. ఇంతలోనే సైడ్ ట్రాక్ పట్టేసింది. ఓ యువ హీరోతో తాను ప్రేమాయణం నడుపుతోందని టాక్. ఈ హీరోకి ప్రస్తుతం సినిమాల్లేవు. తనకంటూ గుర్తింపు కూడా లేదు. ఆమధ్య బిగ్ బాస్‌కి వెళ్లొచ్చాడంతే. ఆ షోలో కాస్త ఆవేశం చూపించడంతో కాస్త పాపులర్ అయ్యాడు. కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఆ హీరో... ఇప్పుడు ఈ వారసురాల్ని ప్రేమలో దించడంలో మాత్రం విజయవంతం అయ్యాడు.
ఈ విషయమై కాబోయే హీరోయిన్ ఇంట్లో గొడవలు కూడా మొదలయ్యాయి. సినిమాలు చేసుకునే వయసులో ఈ ప్రేమా - దోమా ఏమిటని ప్రతీ రోజూ హీరో గారు కూతురిపై ఫైర్ అవుతున్నాడట. అయితే వాళ్లది కూడా ప్రేమ పెళ్లి కావడం విశేషం. తన కూతురు ఎక్కడ దారి తప్పుతుందో అని హీరోలో బెంగ మొదలైపోయిందట. ఈ గొడవలో తన కెరీర్‌ని కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరి... ఈ కుర్ర హీరోయిన్ ఎప్పుడు తండ్రి మాట విని, దారిలోకి వస్తుందో చూడాలి.