బెనకా యాడ్: మేము వడ్డీ చెల్లించి మీ బంగారాన్ని విడిపిస్తాం, ఈ రోజు ఉన్న మార్కెట్ రేటుతో మీ బంగారంతో పాటు రాళ్ల విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని బెనకా యాడ్‌లో కనిపించారు సహజనటి జయసుధ. ఆమె నటించిన బంగారం కంపెనీ యాడ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జయసుధ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ... 'బెనకా గోల్డ్ కంపెనీ బెంగుళూరులో తమ సేవలతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అందుకే ఆ సంస్థ యాడ్ డైరెక్టర్ దీపక్ ఆవుల గారు, మేడమ్ మనం యాడ్ చేద్దాం అనగానే వెంటనే ఓకే అనేశాను. ఆ కంపెనీ యం.డి భరత్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
బెనకా గోల్డ్ సంస్థ యండి యస్ భరత్‌కుమార్ మాట్లాడుతూ..'తెలుగు రాష్ట్రాల్లో మేము 20 బ్రాంచిలను ప్రారంభిస్తాం' అన్నారు. యాడ్ డైరెక్టర్ దీపక్ ఆవుల మాట్లాడుతూ 'జయసుధ గారి వంటి గొప్ప నటితో కలిసి ఈ యాడ్ తో పనిచేయటం ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది అని సంతోషం వ్వక్తం చేశారు.