ఒకప్పటి కథానాయిక మాలాశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త కుణిగల్ రాము(52) కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితమే ఆయనకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అప్పటి నుంచి బెంగళూరులోని ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
కుణిగల్ రాము ఓ నిర్మాత కూడా. కన్నడలో దాదాపు 40 సినిమాలను ఆయన నిర్మించారు. లాకప్ డెత్ కలాసిపాళ్య, ఏకే47 వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. మాలాశ్రీ తెలుగులో ఒకప్పటి పాపులర్ హీరోయిన్. కన్నడలోనూ హిట్లు కొట్టింది. ఆ సమయంలోనే నిర్మాత కణిగల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కణిగల్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.