నితిన్ సినిమా 'లై'తో తెరంగేట్రం చేస్తోంది ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడంతో కెమెరా ముందుకు రాగానే కొంచెం భయపడిందట. కానీ డైరెక్టర్ హను రాఘవపూడి చాలా హెల్పింగ్ నేచర్‌తో తన నుండి రావాల్సిన యాక్టింగ్‌ని రాబట్టారనీ చెబుతోంది. అలాగే నితిన్ తనకు చాలా సపోర్టింగ్‌గా ఉండేవాడనీ అంటోంది. తెలుగు కూడా నేర్చుకుంటోందట ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినిమా తనకి మొదటి సినిమా కావడం తనకెంతో ఆనందంగా ఉందంటోంది. అలాగే నితిన్ ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటిస్తోంది. పవన్ - త్రివిక్రమ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమాకి నితిన్‌కి జోడీగా ఈ ముద్దుగుమ్మనే ఎంచుకున్నారు. అంటేనే అమ్మడి టాలెంట్ ఏంటో అర్ధమైపోతోంది. అలాగే తమిళంలోనూ రెండు సినిమాలకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానంటోంది. తొలి సినిమా విడుదల కాకుండానే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ బాగానే వచ్చేస్తున్నాయి. యంగ్ హీరో రామ్ సరసన నటించే ఆఫర్ కూడా కొట్టేసింది ఈ భామ. అయితే తమిళ సినిమా డేట్స్ అడ్జస్ట్ కాక రామ్ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందట. మేఘా ఆకాష్ ప్లేస్‌లోకి రామ్ సరసన లావణ్య త్రిపాఠి వచ్చి చేరింది. అది వేరే విషయం. మొత్తానికి ఈ ముద్దుగుమ్మకి తెలుగులో బిగినింగ్ బాగా నే ఉందని చెప్పొచ్చు. ఆగష్టు 11న 'లై' ప్రేక్షకుల ముందుకు రానుంది.