అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్ రక్షిత నిర్మాతగా మారింది.తన తమ్ముడు రానా ను హీరోగా పరియచం చేస్తూ నాలుగు భాషల్లో ‘‘ఏక్ లవ్ యా’’ అనే సినిమా తీస్తోంది. ఈ సినిమా తెలుగు,కన్నడ,తమిళ,మలయాళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ మూవీకి రక్షిత భర్త,కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కన్నడలో శివరాజ్ కుమార్,పునీత్ రాజ్ కుమార్,దర్శన్,సుదీప్ లాంటి పెద్ద హీరోలతో చాలా సినిమాలు చేశాడు ప్రేమ్. ఇక రానా విషయానికొస్తే లుక్స్ పరంగా బాగున్నాడు.సిక్స్ ప్యాక్ తో ఫస్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు.తొలి సినిమాతోనే నాలుగు భాషల్లో ఎంట్రీ ఇవ్వడం విశేషం.ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తోంది టీమ్.