తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి,డ్రగ్స్ మహమ్మారి పై పోరాటం చేస్తున్నారు. డ్రగ్స్ కి వ్యతిరేఖంగా సినిమా వాళ్ళని కూడా కాంపైనింగ్ చేయమన్నారు. ఇన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. రీసెంట్ గా సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 35 లక్షల రూపాయల విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌తో పాటు 2 పాస్‌పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్ కూడా ఉండటం గమనార్హం.
ఆఫ్రికాకు చెందిన అనౌహా బ్లెస్సింగ్ , అజీజ్ నోహీం, అల్లం సత్య వెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహ్మద్ మహబూబ్ షరీఫ్ అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు డ్రగ్ సప్లయర్లు పరారయ్యారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని డీసీపీ ప్రకటించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారని, టెస్ట్ లో పాజిటివ్ అని తెలిసినట్లు తెలిపారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు.