రవీనా వైరల్ వీడియో... నిజానిజాలు ఏమిటి?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ హీరోయిన్ రవీనా టాండన్‌ అంటే తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా  బాలకృష్ణతో 'బంగారు బుల్లోడు' సినిమాలో నటించింది . కెరియర్ లో బిజీగా ఉన్నప్పుడే  పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓ వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. కేజీఫ్ సినిమాలో కీలక పాత్రలో తన నటనతో మెప్పించింది.  ప్రస్తుతం రవీనాకి సంభందించిన ఒక వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. ముంబై వీధుల్లో ఆమె డ్రైవర్‌పై స్థానికులు చేసిన దాడి ఘటన చర్చనీయాంశం అయ్యింది. ఇదే సంఘటనలో రవీనా కూడా ఉన్నారు.  ఆమె ‘మాపై దాడి చేయకండి’ అంటూ వేడుకోవటం ఆ వీడియోలో ఉంది.  దీనితో గాసిప్ రాయళ్ళు, నెటిజన్స్ పలువురు రవీనా, ఆమె డ్రైవర్‌ ఇద్దరం డ్రింక్ చేసి ఉన్నారని, తాగిన మత్తులో డ్రైవింగ్ చేయటం వలన స్థానికులు వారిపై దాడి చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 


శనివారం రాత్రి ముంబయిలోని బాంద్రా కార్టర్‌ రోడ్డులో ముగ్గురిని రవీనా కారు ఢీకొన్నట్లు,  బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు కొందరు ప్రశ్నించారని,  రవీనా, డ్రైవర్‌ వారిపై దాడికి దిగటంతో అక్కడున్న వారు రవీనాని కొట్టడానికి రాగా ఆమె వేడుకుంటున్నట్లు  ప్రచారం జరిగింది. ఈ వార్తలకి చెక్ పెడుతూ ముంబయి పోలీసులు అసలు విషయాలు వెల్లడించారు. అది ఫాల్స్ కేస్ అని, రవీనా, కానీ ఆమె డ్రైవర్ కానీ మద్యం తాగలేదని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ చెక్ చేసాం,  కారు పార్కింగ్ కోసం డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా, అప్పుడే ఓ ఫ్యామిలీ ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. వారికి ఏం తగలేకపోయినా కావాలని డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. రివర్స్‌ చేస్తున్నప్పుడు వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకోవాలంటూ వాదనకి దిగారు. గొడవ పెద్దది కావటంతో రవీనా అక్కడికి వచ్చి వారించే ప్రయత్నం చేసారని, డ్రైవర్‌ ను సేవ్ చేసే ప్రయత్నంలో ఆమె ఆలా వేడుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


రవీనా ఎంత సర్ది చెప్పినా వినని వారు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసారని, అసలు రవీనా టాండన్, డ్రైవర్ తప్పులేదని తేల్చి  చెప్పారు పోలీసులు. రవీనా కూడా పోలీసులు స్టేట్‌మెంట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ చేసి, తన పై వస్తున్నా పుకార్లకు చెక్ పెట్టింది. దీనితో ఈ విషయం పై పలువురు బాలీవుడ్ నటీ నటులు రవీనాకి సపోర్టుగా నిలుస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS