రాబిన్ హుడ్ తో శ్రీలీల రేంజ్ మారనుందా?

మరిన్ని వార్తలు

శ్రీలీల కెరియర్ స్టార్టింగ్ లోనే  జెట్ స్పీడ్ లో దూసుకు వచ్చింది. ఓ రెండేళ్ల పాటు ఏ సినిమాలో చూసినా శ్రీలీలే కనిపించేది. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ లు కావటంతో  క్రమ క్రమంగా అమ్మడి క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఇలాంటి టైంలో కొన్ని ఐటెం సాంగ్స్ అఫర్ వచ్చినా నో చెప్పింది. కానీ పుష్ప 2 లో చేసిన ఐటెం సాంగ్ శ్రీలీల కెరియర్ కి ప్లస్ అయింది. కిస్సిక్ సాంగ్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది శ్రీలీల. తెలుగు, తమిళం , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగులో నితిన్ తో కలిసి చేసిన రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28 న రిలీజ్ కానుంది.  ఈసినిమాతో  శ్రీలీల గ్రాఫ్ అమాంతం పెరగనుంది  అని టాక్.   


రాబిన్ హుడ్ మూవీని వెంకీ కుడుములు తెరకెక్కించాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నటిస్తే కెరియర్ పీక్స్ కి వెళ్తుంది అని కొందరి అభిప్రాయం. కారణం వెంకీ 'ఛలో' సినిమాతో  రష్మిక ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలు అందుకుంది. నెక్స్ట్ అదే వెంకీతో భీష్మ మూవీలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. భీష్మ తరవాత రష్మిక నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా ఇలా అన్ని వరుస హిట్స్ అందుకుని మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. 


ఇప్పడు శ్రీలీల కెరియర్ కూడా అదే రేంజ్ లో కొనసాగుతుంది అని సినీ విశ్లేషకుల అంచనా. మళ్ళీ శ్రీలీల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా లెక్కలు వేస్తున్నారు. రాబిన్ హుడ్ లో శ్రీలీల పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని టాక్. ఇప్పటికే తమిళంలో శివ కార్తికేయన్ తో ఒక మూవీ చేసింది. ఈ మూవీలో కూడా శ్రీలీల ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేసింది. ఇవి కాక తెలుగులో రెండు సినిమాలు, బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ఆషీకీ 3 చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS