ముద్దుగుమ్మ ఆదా శర్మకి అందంతో పాటు, కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కూడా ఎక్కువే. అమ్మడికి జంతువులంటే చాలా ఇష్టం. అందులోనూ స్ట్రీట్ ఏనిమల్స్ అంటే ఎంతో ప్రేమట. కొన్ని కొన్ని స్ట్రీట్ డాగ్స్‌ని చేరదీసి, వాటిని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదాశర్మ ఓ పిల్లి పిల్లని ప్రేమగా ఎత్తుకుని ఉన్న ఫోటో అది. పిల్లి పిల్ల చాలా ముద్దుగా ఉంది. అంతకంటే ముద్దుగా ఆదాశర్మ అందం మెరిసిపోతోంది. జంతువులంటే ప్రేమ సంగతి పక్కన పెడితే, పిల్లి పిల్లతో ఆదాశర్మ క్యాజువల్‌గా ఫోటో దిగినట్లుగా లేదండోయ్. ఫోటోలో ఆదా డిఫరెంట్ గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. మామూలుగానే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే ఆదాశర్మ, తాను పోస్ట్ చేసే ఫోటోలు సమ్‌థింగ్ స్పెషాలిటీ, క్రియేటివిటీ ఉండేలా చూసుకుంటుంది. అందులో భాగంగానే, తాజా ఫోటోలో పింక్ కలర్ హెయిర్ స్టైల్‌తో, ముద్దు ముద్దుగా ఉన్న పిల్లి పిల్లని పట్టుకుని ఫోటోకి పోజిచ్చింది.
అంతేకాదండోయ్, పెట్స్‌ని పెంచుకోవడం వల్ల మానసికంగా చాలా హెల్దీగా ఉండొచ్చనే సందేశాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ ప్రచారం చేస్తోంది. ఒత్తిడికి లోనైనప్పుడు పెట్స్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేస్తే, చాలా ఊరటగా ఉంటుదనీ చెబుతోంది ఆదాశర్మ. తెలుగులో 'సన్నాఫ్ సత్యమూర్తి', 'గరమ్', 'క్షణం' తదితర చిత్రాల్లో నటించింది.
బాలీవుడ్‌లో 'కమాండో 2' తదితర చిత్రాల్లో నటించింది. సినిమాప పరంగా అంతగా బిజీయెస్ట్ హీరోయిన్ కాకపోయినా, ఇతరత్రా వ్యాపకాలతో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ బిజీగానే కాలం గడుపుతూ ఉంటుందట.