ప్రభాస్ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' 16న వస్తోంది. ఈపాటికి బుకింగ్స్ ఓపెన్ కావాలి. బుక్ మై షో లో కానీ మరే ఇంత మాధ్యమాల్లో ఇంకా టికెట్లు అందుబాటులోకి రాలేదు. దీనికి కారణం.. ఆదిపురుష్ టికెట్ ధర పెంచుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రలలో టికెట్ ధరలు పెరుగుతున్నాయి. మల్టీ ప్లెక్స్ లో యాభై రూపాయిలు, సింగల్ స్క్రీన్స్ లో 25 రూపాయిలు చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో రెడీ అయ్యింది. ఏ క్షణమైనా విడుదల చేయొచ్చు.
టికెట్ రేట్లు పెంపు వసూళ్ళ పై ప్రభావం చూపనుంది. నిజానికి టికెట్ రేట్లు పెంపు రెండు రకాల ఫలితాలు ఇచ్చింది. గతంలో టికెట్ పెంచమని సినీ రూపకర్తలు కోరారు. కానీ ప్రేక్షకుల నుంచి రావాల్సిన ఆదరణ రాలేదు. ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచే వ్యూహం ఫలించలేదు. తర్వాత మా సినిమాకి సాధారణ రేట్లు పెడుతున్నామని అదొక ప్రచారం సాధనంగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. ఐతే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం మంచి ఫలితం ఇస్తుందనే నమ్మకం నిర్మాతల్లో వుంది.