సలార్, ప్రాజెక్ట్ కె, ఆది పురుష్.. ఇలా ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అన్నీ భారీ ప్రాజెక్టులే. ఒకదాని తరవాత మరో సినిమా. వారం రోజులు ఓ సినిమా సెట్లో ఉంటే, మరో వారం మరో సినిమా సెట్లో కనిపిస్తున్నాడు ప్రభాస్. తాజాగా.. ఆది పురుష్‌కి డేట్లు ఇచ్చాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ చిత్రం... ఆది పురుష్. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది.
ముంబై శివార్లలోని స్టూడియోలో ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన సెట్ రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ అక్కడే జరుగుతోంది. బుధవారం ప్రభాస్ ఈ సెట్లో అడుగుపెట్టాడు. ఈ షెడ్యూల్ లో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొనబోతున్నాడట. ప్రభాస్ - సైఫ్‌ల మధ్య కొన్నియాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించబోతున్నారు. రెండు వారాల పాటు ఏకధాటిగా షూటింగ్ సాగబోతోంది. ఈ రెండు వారాలూ.. ప్రభాస్ ముంబైలోనే ఉంటాడు. ఆ తరవాత.. సలార్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.