అడవిశేష్‌ అదరగొట్టేశాడు.!

మరిన్ని వార్తలు

అడవిశేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'గూఢచారి'. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఎందుకో ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలున్నాయి. అలాంటిది టీజర్‌ వచ్చాక ఆ అంచనాలు ఎన్నో రెట్లు రెట్టింపయ్యాయి. 

హాలీవుడ్‌ స్టైల్‌ మేకింగ్‌, అడవిశేష్‌ అప్పియరెన్స్‌ అదిరిపోయాయి. రిచ్‌ లొకేషన్స్‌. రిచ్‌ కాస్ట్యూమ్స్‌ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. టీజర్‌ అందరికీ షాకిచ్చింది. శిశికిరణ్‌ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అడవిశేష్‌ కేవలం నటుడు మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్‌. ఈ సినిమాకి స్టోరీ ఆయనే అందించాడు. మంచి యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉన్నోడు. 'క్షణం' సినిమాతో ఆల్రెడీ సోలో హీరోగా హిట్‌ కొట్టాడు. ఇప్పుడు రాబోతున్న ఈ 'గూఢచారి' అడవిశేష్‌ స్టామినాని మరింత పెంచేలా ఉంది. 

ఇకపోతే ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తొలి సినిమాతోనే అమ్మడు ఓ రేంజ్‌లో హాట్‌నెస్‌ చూపించేసిందనీ టీజర్‌లోనే శాంపిల్‌గా చూపించేశారు. అడవిశేష్‌తో లిప్‌లాక్‌ సీన్‌ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌, లిప్‌లాక్‌ ఎపిసోడ్‌ చూస్తుంటే, అచ్చం హాలీవుడ్‌ సినిమానే తలపిస్తోంది. అయినా ఈ మధ్య సినిమా రిజల్ట్‌ని టీజర్‌, ట్రైలర్స్‌ చూసి అంచనా వేయలేకపోతున్నాం. 

చూడాలి మరి 'గూఢచారి'తో అడవిశేష్‌ ఏం చేస్తాడో. ఆగష్టు 3న 'గూఢచారి' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS