AAS Review: ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరిస్ రివ్యూ

మరిన్ని వార్తలు

దర్శకుడు: అరుణ్ పవార్
నటీనటులు: షణ్ముఖ్ జస్వంత్, వైశాలి రాజ్, అలంకృత షా, పృథ్వీ జాఖాస్
నిర్మాతలు: వందన B
సంగీతం: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: దనుష్ భాస్కర్


'వైవా' అనే చిన్న షార్ట్ ఫిల్మ్ షణ్ముఖ్ జస్వంత్ కి లైఫ్ ఇచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత యుట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షోతో చాలా మందికి పరిచయం ఏర్పడింది. యూట్యూబ్ కంటెంట్ చేసుకునే షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు ఆహా కోసం ఒక వెబ్ సిరిస్ చేశాడు. అదే ఏజెంట్ ఆనంద్ సంతోష్. రెండు ఎపిసోడ్లుగా విడుదలైన వెబ్ సిరిస్ రివ్యూలోకి వెళితే..,


కథ:


ఆనంద్ సంతోష్ (షణ్ముఖ్ జస్వంత్) ఒక డిటెక్టివ్ ఏజెంట్. తన ఫ్రండ్ అయోమయం(పృథ్వీ జఖాన్)తో కలసి తనే ఒక చిన్న డిటెక్టివ్ ఏజన్సీ పెట్టుకుంటాడు. పక్కింట్లో చెప్పులుపోయాయని, వాటర్ క్యాన్ మిస్ అయ్యిందని ఇలాంటి సిల్లీ కేసులు వాళ్ళ దగ్గరికి వస్తుంటాయి. సరైన కేసు కోసం ఎదురుచూన్న ఆనంద్ కి హైదరాబాద్‌లోని కూకక్‌ట్‌పల్లిలో ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఆ కేసుని ఎలా డీల్ చేశాడు ? అసలు ఆనంద్ సంతోష్ గతం ఏమిటి ? అతడి ప్రేమ కథలో వున్న అడ్డంకులు ఏమిటనేది మిగతా కథ.


విశ్లేషణ:


వెబ్ సిరిస్ అంటే ఒక సిరిస్ కనీసం ఐదు ఎపిసోడ్లు వుంటాయి. కానీ ఏజెంట్ ఆనంద్ సంతోష్ మాత్రం కేవలం రెండు ఎపిసోడ్లతో ఇంట్రోలా విడుదల చేశారు. మొదటి ఎపిసోడ్ 'మ్యాగనా సర్'లో ఏజెంట్ ఆనంద్ సంతోష్ పాత్ర పరిచయం, తర్వాత స్నేహితుడితో వచ్చే కొన్ని కామెడీ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఒక నెమ్ బోర్డ్ ని రెండు పక్కల వాడుకోవడం, పేమెంట్ విషయంలో పీనాసితనం, లంచ్ టైం లో ఇన్వెస్ట్ గేషన్ కి వెళ్లి లంచ్ చేసి పడుకోవడం ఇవన్నీ సరదాగా అనిపిస్తాయి. ఇక మొదటి కేసు కూడా హీరో ఇంట్రో కోసమే వాడుకున్నారు. అందులో పెద్ద థ్రిల్ ఏమీ వుండదు. 


రెండో ఎపిసోడ్ ఏంట్రా ఇదిలో సంతోష్ ఫ్లాష్ బ్యాక్ లో లవ్ ని చూపించారు. పెళ్లి గురించి మాట్లాడటానికి అమ్మాయి ఇంటికి వెళ్ళడం. అమ్మాయి తండ్రి బాబు అనంత్ బాబు సంతోష్ మధ్య జరిగిరే సంభాషణతోనే దాదాపు ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఏజెంట్ గా కాకుండా ఎక్కడైన నెలకి జీతం వచ్చే ఉద్యోగం చూసుకోమని పెళ్లి కూతురు తండ్రి చెప్పడంతో ఉద్యోగ వేటలో ఒక ఏజన్సీలో చేరుతాడు ఆనంద్. ఆ ఏజన్సీ నేపధ్యంలో వచ్చే పాత్రలు నవ్వు తెప్పించాయి. ఆనంద్ చేరిన రోజే మరో కేసు వస్తుంది. వాస్తవానికి అదే అసలైన కథ అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి వచ్చిన రెండు ఎపిసోడ్లు కేవలం ఒక ఇంట్రో లానే వున్నాయి. 


నటీనటులు:


షణ్ముఖ్ జస్వంత్ వన్ మ్యాన్ షో ఇది, అతనే ప్రతి సీన్ లో వున్నాడు. అయోమయం పాత్రలో చేసిన నటుడు కూడా ఈజ్ తో చేశారు. వైశాలి రాజ్, అలంకృత షా అందంగా కనిపించారు. అనంత్ బాబు పాత్ర బావుంది. మిగతా నటీనటులు ఓకే. 


టెక్నికల్ :


చిన్న బడ్జెట్ సిరిస్ ఇది. యూట్యూబ్ కంటెంట్ కి సరిపడే ప్రొడక్షన్ కనిపిస్తుంటుంది. ఈ సిరీస్ కి రైటర్ గా పని చేసిన సుబ్బు.. ఇదివరకు 'సూర్య', 'సాఫ్ట్ వేర్ డెవెలపర్' వంటి హిట్ వెబ్ సిరీస్ లకు పని చేశారు. ఈ రెండు ఎపిసోడ్లు యూట్యూబ్ ఫీల్ నే ఇచ్చాయి. దర్శకుడు అరుణ్ పవర్ ఇంకొన్ని గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ని ప్లాన్ చేసుకోవాలి. నేపధ్య సంగీతం, కెమరా పనితనం ఓకే.


ప్లస్ పాయింట్స్ 


షణ్ముఖ్ జస్వంత్
కొన్ని కామెడీ సీన్స్ 


మైనస్ పాయింట్స్


కంటెంట్ తక్కువ వుండటం 
థ్రిల్ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్: ఏజెంట్ కథ ఇంకా స్టార్ కాలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS