వారణాసిలో - అదిరిందయ్యా 'అజ్ఞాతవాసి'

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాన్‌ న్యూ ట్విట్టర్‌ అకౌంట్‌తో అభిమానులకు పండగే పండగ. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలకి సంబంధించిన ఫోటోస్‌ని ఈ ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ అభిమానుల్ని ఫుల్‌ ఖుషీ చేస్తున్నాడులే పవర్‌ స్టార్‌. ఇదివరకు పాత ట్విట్టర్‌లో సినిమాలకు సంబంధించి ఏ విషయంలోనూ స్పందించేవాడు కాదు పవన్‌. కానీ ఇప్పుడు అలా కాదు. పూర్తిగా మారిపోయాడు పవన్‌. ఎప్పటికప్పుడే సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇంతకన్నా అభిమానులకు పవన్‌ నుండి కావాల్సిందేముంటుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో 'అజ్ఞాతవాసి' సినిమాలో నటిస్తున్నాడు పవన్‌ కళ్యాణ్‌.

ఈ సినిమాకి సంబంధించి, ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాడు. ఆ స్టిల్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతున్నాయి. తాజాగా ఓ పాటకి సంబంధించిన సీన్‌లోని స్టిల్‌ పోస్ట్‌ చేశాడు. స్టిల్‌ సూపర్‌ ఉందిలే. బ్యాక్‌ గ్రౌండ్‌లో డాన్సర్స్‌, జోరుగా డాన్సు వేస్తుంటే, రంగోలీ కలర్స్‌ మధ్యన పవన్‌ అలా నడిచి వస్తుంటే స్టిల్‌ అదిరిపోయిందంతే. ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా నటిస్తున్నాడు ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌.

జీన్స్‌, టీషర్ట్స్‌లో భలే హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు స్టిల్స్‌లో. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ ఫుల్‌ గ్లామరస్‌గా కనిపించనుంది. కీర్తి సురేష్‌ ఎప్పటిలాగే ట్రెడిషనల్‌ వేర్‌లో కనువిందు చేయనుంది. అనిరుధ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. సరికొత్త మ్యూజిక్‌నందించాడు అనిరుధ్‌. ప్రస్తుతం వారణాసిలో షూటింగ్‌ జరుగుతోంది. వారణాసి అందాల్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్న పవన్‌ స్టిల్స్‌ ఆదరహో అనిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS