ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని త్రివిక్రమ్ ఎన్నడూ ఊహించి ఉండడు. ఒక్క సినిమా ఇన్నాళ్లుగా త్రివిక్రమ్ సంపాదించుకున్న ఇమేజ్‌నంతటినీ డ్యామేజ్ చేసేసింది. అయినా కానీ త్రివిక్రమ్ అంటే కేవలం దర్శకుడు మాత్రమే కాదు. మాటల మాంత్రికుడు. మేధావి. అయితే అవన్నీ ఇప్పుడు 'అజ్ఞాతవాసి' సినిమాతో పటాపంచలైపోయాయి. ఇప్పుడు సినిమాల ట్రెండ్ అలాగే ఉంది. ఒక్క సినిమాతో స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోతోంది. అదే ఒక్క సినిమాతో శిఖరాన్ని అందుకున్న ఇమేజ్ కూడా పడిపోతోంది.
ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్థితి అలాగే అయిపోయింది. 'అజ్ఞాతవాసి' సినిమా దారుణంగా నిరాశపరచడంతో ఆ ఎఫెక్ట్ త్రివిక్రమ్ తదుపరి చేయబోయే ఎన్టీఆర్ సినిమాపై పడనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా విషయంలో అనేక రకాల గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ కథ కాపీ అనీ, లేదు లేదు ఓ నవల ఇన్‌స్పైరింగ్‌గా తెరకెక్కిస్తున్నాడనీ పలు రకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇదంతా ఓ ఎత్తు కాగా, త్రివిక్రమ్‌పై ఎన్టీఆర్ బాగా ప్రెజర్ పెడుతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా భారీ అంచనాలతో తెరెకెక్కిన 'అజ్ఞాతవాసి' దెబ్బ కొట్టడంతో త్రివిక్రమ్ కూడా ఒకింత డీలా పడ్డాడట. తనకు తానుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన సందర్భమే ఇది. ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమాపై ఖచ్చితంగా పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆ డిప్రెషన్‌ని తట్టుకుని త్రివిక్రమ్ నిలబడతాడా? లేక డిప్రెషన్‌తో మరో మిస్టేక్ చేస్తాడా? అనేది వేచి చూడాలిక.