డిజాస్టర్ మూవీస్ లో స్థానం సంపాదించిన 'అజ్ఞాతవాసి'

By iQlikMovies - July 05, 2018 - 16:28 PM IST

మరిన్ని వార్తలు

ఈ ఏడాది లో సగం పూర్తయిన వేళ, ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన తెలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా తమ సత్తా చాటాయి అన్న ఒక సర్వే ఈమధ్యనే బయటికొచ్చింది. ఆ సర్వేలో భాగంగా అత్యంత నిరాశ లేదా ఫ్లాప్ సినిమాల జాబీతా కూడా ఒకటి వెలువడింది.

ఆ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం నిలిచింది, దీనికి కారణం ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఈ చిత్రం పైన ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకోవడం తో ఆ అంచనాలని ఈ చిత్రం అందుకోవడంలో బోల్తా కొట్టింది.

ఈ చిత్ర పరాజయంలో అందరూ ఎక్కువగా త్రివిక్రమ్ నే బాద్యుడిని చేశారు, కారణం ఈ చిత్రంలో బలమైన కథ లేకపోవడమే అలాగే కథనం కూడా త్రివిక్రమ్ స్థాయి కన్నా చాలా తక్కువగా ఉందన్న మాటలు వినిపించాయి. ఏదైతే ఏంటి ఈ చిత్రం మాత్రం అందరిని తీవ్రంగా నిరాశపరిచిన చిత్రంగా మిగిలిపోయింది.

అందుకోసమే ఈ ఏడాది ప్రధమార్ధం వచ్చిన ఫ్లాప్ చిత్రాల జాబీతాలో ముందు వరుసలో నిలిచింది. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న మరికొన్న ప్రముఖ చిత్రాలు ఇవే- టచ్ చేసి చూడు, ఇంటెలిజెంట్, ఛల్ మోహన రంగ, కృష్ణార్జున యుద్ధం, నెల టిక్కెటు, నా పేరు సూర్య & ఆఫీసర్.

ఇది ఒకరకంగా పవన్ ఫ్యాన్స్ కి మింగుడుపడని నిజమే...   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS