కోవిడ్ మహమ్మారి వలన OTT సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. అంతక ముందే OTT సంస్థలున్నా కోవిడ్ తరవాత అందరిలోకి వెళ్లాయి. ఆ టైమ్ లో థియేటర్లు మూతపడటం, లాక్ డౌన్ ఈ కారణాలతో ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే వారికి ఓటీటీ ప్లాట్ ఫామ్ లే దిక్కు అయ్యాయి. అప్పటి నుంచి ఒక భాషలో వచ్చిన సినిమా అయినా , సిరీస్ అయినా అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. అన్ని ప్రాంతీయ లాంగ్వేజెస్ లోకి డబ్బింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్స్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.
OTT లకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని తెలుగు వారి కోసం టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా 'ఆహా OTT యాప్' స్టార్ట్ చేశారు. ఆహా లో కేవలం తెలుగు సినిమాలు, షోలు, సిరీస్ లు అందుబాటులోకి తెచ్చారు. మంచి మంచి తమిళ, మలయాళం డబ్బింగ్ సినిమాలు , చిన్న సినిమాలు కూడా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఆహా యాప్ 'ప్లే స్టోర్' లో కనిపించటం లేదని ఎంటర్టైన్మెంట్ ప్రియులు కంగారు పడుతున్నారు. అసలు ‘ఆహా’ ఎందుకు కనిపించడం లేదు అన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
పాలసీలను ఉల్లంఘించిన కారణంగా ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను గూగుల్ తొలగించిందని సమాచారం. ఎలాంటి హెచ్చరికలు లేకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా సడెన్ గా ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ని తొలగించారని తెలుస్తోంది. ప్లే స్టోర్ లో ఆహా యాప్ కనిపించకపోవడంతో తెలుగు ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఆహా లో వచ్చే టాక్ షో లు మంచి క్రేజ్ ని తెచ్చుకున్న సంగతి తెలిసందే. ఆహా లో వచ్చిన NBK టాక్ షో ఇండియా వైడ్ ఫేమస్ అయ్యింది. బాలయ్య క్రేజ్ ని మరింత పెంచింది.
ఆహాతో పాటు మరి కొన్ని యాప్స్ కూడా ప్లే స్టోర్‌లో కనిపించడం లేదని తెలుస్తోంది. షాదీ, అల్ట్ బాలాజీ, భారత్ మ్యాట్రిమోనీ, నౌక్రీ, 99 ఎకర్స్, కూకూ ఎఫ్ఎమ్, స్టేజ్ ఓటీటీ, క్వాక్ క్వాక్ వంటి ఇండియన్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ఐటీ దిగ్గజాలు ఖండిస్తూ గూగుల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.