బిగ్ బి కుటుంబం మొత్తం కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్, అభిషేక్ ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజులకే ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటీవ్ అని తేలడంతో - వాళ్లనీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఐష్, ఆరాధ్యల ఆరోగ్యం కుదట పడింది. దాంతో.. నానా వతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఐష్, ఆరాధ్యలకు కరోనా నెగిటీవ్ గా తేలిందని, ఇప్పుడు వాళ్లు క్షేమంగా,సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నారని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో అమితాబ్, అభిషేక్ ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వాళ్ల ఆరోగ్యం కూడా క్రమంగా కుదటపడుతోందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.