భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మేటి నటీమణులలో ఒకరైన నర్గీస్ నటించిన ఆఖరి చిత్రం- ‘రాత్ ఔర్ దిన్’.ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ సన్నాహాలు మొదలుపెట్టారు.
అయితే ఇందులో ప్రధాన పాత్రకి ఐశ్వర్య రాయి, మాధురి దీక్షిత్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శకులు తమ ఛాయస్ గా ఐశ్వర్య రాయి పేరుని చెప్పగా నిర్మాణ సంస్థ వారు మాత్రం మాధురీ దీక్షిత్ వైపు మొగ్గుచూపుతున్నారట.
మరి చివరికి ఈ ఇద్దరిలో ఎవరిని ఈ పాత్ర వరించనున్నదో కొద్దిరోజుల్లో తెలుస్తుంది.