'మైదాన్‌'లో అజయ్‌దేవగణ్‌ లుక్‌ చూశారా!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మైదాన్‌'. అమిత్‌ శర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'మైదాన్‌' ఇన్‌స్పైర్డ్‌ బై ఏ ట్రూ స్టోరీ అనే క్యాప్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ఓల్డ్‌ ప్యాటర్న్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఈ లుక్‌ కనిపిస్తోంది. పక్క పాపిట తీసి నీట్‌గా దువ్వుకున్న హెయిర్‌ స్టైల్‌, క్యాజువల్‌ వేర్‌లో అజయ్‌ దేవగణ్‌ కనిపిస్తున్నాడు. చేతిలో ఓ బ్యాగ్‌, పాత కాలం నాటి గొడుగూ పట్టుకుని మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిగా కనిపిస్తునాడు. కాలితో బాల్‌ని తన్నుతూ జోష్‌గా కనిపిస్తునాడు. ఆ బాల్‌ ఏంటో తెలుసా? ఫుట్‌బాల్‌. అంటే అర్ధమయ్యే ఉంటుంది ఈ సినిమా ఫుట్‌బాల్‌ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా అని.

ajay devgan maidaan first look

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ ఫస్ట్‌లుక్‌తో పాటు, పక్కనే ఉన్న మరో పోస్టర్‌లో ఆ విషయం ఎలాగూ రివీల్‌ చేశారు. మంచి కసి మీదున్న ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు, వారిలో చైతన్యం నింపుతున్న కోచ్‌ (వెనక నుండి) కనిపిస్తున్నాడు. అయితే, ఆ కోచ్‌ అజయ్‌దేవగణా.? కాదా.? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే, ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ, అజయ్‌ పక్కన కీర్తి మరీ చిన్న పిల్లలా కనిపిస్తోందనే కారణంతో ఆమె ఈ గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది. ఆ ప్లేస్‌ని సీనియర్‌ నటి ప్రియమణి రీప్లేస్‌ చేసింది. నవంబర్‌ 27న 'మైదాన్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

maidaan first look


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS