ఆర్.ఆర్.ఆర్ సందడి మొదలు కాబోతోంది. సోమవారం నుంచి `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ మొదలెడతారు. అయితే ఇది ట్రైల్ షూట్ మాత్రమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ ట్రైల్ షూట్ లో పాల్గొంటారు. అలియాభట్ కూడా కాల్షీట్లు ఇచ్చిందని, తాను కూడా షూటింగ్ లో పాల్గొనబోతోందని సమాచారం.
అయితే ఇప్పుడు అజయ్ దేవగణ్ కూడా వచ్చేస్తున్నాడు. అతి త్వరలోనే సెట్లోకి అజయ్ అడుగుపెట్టబోతున్నాడట. ఇది వరకే అజయ్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈసారి అలియా కాంబినేషన్ లోనూ అజయ్‌కి కొన్ని సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్‌కి సంబంధించి అజయ్ ఇప్పుడు కాల్షీట్లు ఇచ్చాడని, దాని ప్రకారమే రాజమౌళి షెడ్యూల్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు షూటింగ్ లో పాల్గొనేవాళ్లని క్వారెంటైన్‌లో ఉంచుతున్నార్ట. అజయ్ కూడా క్వారెంటైన్‌లోనే ఉండబోతున్నాడని సమాచారం. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగబోతోందని అర్థమవుతోంది. ఈనెలలోనే ఎన్టీఆర్ టీజర్ నీ విడుదల చేస్తారని సమాచారం.