దర్శకుడు పూరి జగన్నాధ్ కి ఫ్లాపులు వున్నాయి కానీ 'లైగర్' లాంటి దారుణమైన ఫలితం రావడం ఇదే తొలిసారి. పాన్ ఇండియా హడావిడి చేసిన తీసిన లైగర్.. చాలా పెద్ద కొట్టేసింది. లైగర్ దెబ్బతో జనగణమన అటకెక్కెసింది. ఇప్పుడు పూరి చేతిలో సినిమా లేదు. ఆయనికి నిర్మాత సమస్య లేదు. ఆయనే ఛార్మితో కలసి ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాడు. సమస్యంతా హీరోదే. మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా టాప్ లీగ్ స్టార్లందరితోనూ బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకుడు పూరి. అయితే ఇప్పుడీ జాబితాలోని హీరోలెవరూ పూరికి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరి ప్రాజెక్ట్స్ వారికి వున్నాయి. పూరి ఫామ్ మాట పక్కన పెడితే అందరి హీరోల డైరీ మూడేళ్ళు పాటు ఫుల్ అయిపొయింది.
ఇప్పుడు పూరికి హీరో కావాలి. ఆయన రాడార్ లో ఎవరూ లేరు. ఈ సందర్భంలో పూరి ఇంటి నుండి ఒక డిమాండ్ వినిపిస్తుంది. మళ్ళీ తనయుడు ఆకాష్ తో ఒక సినిమా తీయాలని కుటుంబ సభ్యులు పట్టుపడుతున్నారు. హీరోల కోసం ఎదురుచూడటం కంటే ఇంట్లో వున్న హీరోని పెట్టుకొని ఒక విజయం సాధిస్తే మళ్ళీ అంతా సర్దుకుంటుందని పూరి ఇంట్లో వాళ్ళ అభిప్రాయం. అయితే పూరి మాత్రం ఆకాష్ తో సినిమా పై అంత ఉత్సాహం చూపించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆకాష్ తో రెండు సినిమాలు చేశారు పూరి. మొహబూబా ఫ్లాప్. రొమాంటిక్ ఓకే అనిపించింది. ఇటివల ఆకాష్ హీరోగా వచ్చిన చోర్ బజార్ దారుణమైన ఫలితం మూటకట్టుకుంది. ఇలాంటి సమయంలో మళ్ళీ ఆకాష్ తో సినిమా అంటే దానిపై బజ్ క్రియేట్ కావడం కూడా కష్టమే అనే ఆలోచనతో వున్నారు పూరి. మొత్తని లైగర్ పూరికి చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది.