పూరీ హీరోలకు బోలెడన్ని ప్రత్యేకతలుంటాయి. హీరో క్యారెక్టర్‌ని చాలా డిఫరెంట్‌గా బిల్డ్ చేస్తాడు పూరీ. హీరో కొత్తోడైనా కానీ టాలెంట్‌ని పట్టుకోవడంలో పూరీ తర్వాతే ఎవరైనా. ఎన్నో సినిమాలు చేసిన అనుభవాన్ని ఆ హీరోలో చూపించేస్తాడు. రొమాన్స్, యాక్షన్, ఆటిట్యూడ్ ఇలా చాలా రకాల స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి పూరీ సినిమా హీరోల్లో. అలాంటిది తన కొడుకు హీరో అయితే అచ్చం తాను ఎలా అనుకుంటున్నాడో అలాగే కదా చూపించగలడు. అదే జరుగుతుందట ఈ సినిమాలో. అయితే పూరీ ఎంచుకున్న సబ్జెక్ట్ మాత్రం సాదా సీదా సబ్జెక్ట్ కాదు. 1971 కాలం నాటి ఇండియా - పాకిస్థాన్ యుద్ధ సమయంలోని ఓ లవ్‌స్టోరీ. ఈ కాన్సెప్ట్‌ని తన కొడుకు ఆకాష్ పూరీతో తెరకెక్కించబోతున్నాడు పూరీ. పూరీ జగన్నాధ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ ఆకాష్ పూరీ హీరోగా 'ఆంధ్రా పోరీ' అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాని జనం ఎప్పుడో మర్చిపోయారు. ఈ సినిమా ఆకాష్‌కి రీ లాంచింగ్ మూవీ అనుకోవాలి. 'మెహబూబా' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యుద్ధ సన్నివేశాల్ని అత్యద్భుతంగా తెరకెక్కించనున్నాడట పూరీ. తన మనసునీ, ఆలోచనల్ని పూర్తిగా మార్చుకుని మలచిన స్టోరీనే 'మెహబూబా' అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. పూరీ నిర్మాణ సంస్థ అయిన పూరీ కనెక్ట్స్ ద్వారా ఎంపికైన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉండబోతోందట.