పుష్ఫ‌కి బూస్ట‌ప్ ఇచ్చిన అఖండ‌

మరిన్ని వార్తలు

డిసెంబ‌రులో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. 2021 జాత‌కం మొత్తం.. ఆయా సినిమాల‌పై ఆధార‌ప‌డి ఉంది. 2022 సంక్రాంతిలో పెద్ద సినిమాలు వ‌రుస క‌ట్ట‌బోతున్నాయి. వాటికి.... ఓపెనింగ్స్ ఉంటాయా? మాస్ జ‌నాలు ఇది వ‌ర‌క‌టిలా థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అనే అనుమానాలు మాత్రం చాలానే ఉన్నాయి. వాట‌న్నింటినీ అఖండ ప‌టాపంచ‌లు చేసేసింది. ఈ సినిమాకి వ‌స్తున్న ఓపెనింగ్స్‌, థియేట‌ర్ల ద‌గ్గ‌ర క‌నిపిస్తున్న హోస్ ఫుల్ బోర్డులే అందుకు నిద‌ర్శ‌నం. మాస్ సినిమా స్టామినా ఏమిటో.. అఖండ నిరూపించేసింది. ఈ విజ‌యం.. పుష్ఫ‌కి తిరుగులేని ఉత్సాహాన్ని, బూస్ట‌ప్‌ని అందించింది.

 

ఈనెల 17న పుష్ష విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పుష్ఫ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన సినిమా. దీనికి మామూలు ఓపెనింగ్స్ స‌రిపోవు.ఓ సునామీలా విరుచుకుప‌డిపోవాలి. మ‌రి క‌రోనా భ‌యాలు, కొత్త వేరియంట్‌ల ప్ర‌భావాల‌తో జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారో, రారో అనుకున్నారు. అఖండ‌తో.. ఆ దృశ్యం క‌నిపించేసింది. ఈసినిమాకి రివ్యూలు అటూ ఇటుగా వ‌చ్చినా, కుటుంబ ప్రేక్ష‌కులకు ఈ సినిమా దూరంగానే ఉన్నా, జ‌నాలు కిట‌కిట‌లాడిపోతున్నారు. పుష్ష‌లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఏమాత్రం ఉన్నా - అది రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం. ఓర‌కంగా.. అఖండ విజ‌యం పుష్ష‌కు చెప్పుకోలేనంత లాభం చేకూర్చింది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS