నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం `అఖండ`, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ ప్రతినాయక పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని డిసెంబరు 2న విడుదల చేయనున్నారు. శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ అందించింది. రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు వచ్చిందని సమాచారం. ఫస్టాఫ్ 1. 30 గంటలు, సెకండాఫ్ 1.05 నిమిషాలు వచ్చాయని టాక్. చివర్లో మేకింగ్ వీడియో 5 నిమిషాలు వచ్చిందట. కమర్షియల్ అంశాలపై ఈసారి బోయపాటి మరింతగా దృష్టి పెట్టాడని, ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోయిందని, క్లైమాక్స్ లోనూ భారీ పోరాటాలు ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాల టాక్,
బోయపాటి - బాలయ్య కాంబో అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అఖండ కూడా హిట్టయితే.. ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టినట్టే. ఈ సీజన్ లో రాబోతున్న పెద్ద సినిమా ఇదే. ఆ తరవాత పుష్ఫ, శ్యాం సింగరాయ్, గని రాబోతున్నాయి. గత కొంతకాలంగా టాలీవుడ్ కి హిట్టు లేదు. డిసెంబరు నెలలో.. ఆ హిట్టు చూసే అవకాశం దక్కితే బాగుణ్ణు.