ఫ్లాష్ బ్యాక్: అక్కినేని టక్కరి దొంగ.

By Inkmantra - August 05, 2020 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని ఫ్యామిలీలో మూడవ తరం హీరో అయిన అఖిల్ ఇప్పటి వరకు మూడు చిత్రాలలో నటించాడు. అయితే ఇంకా బ్రేక్ మాత్రం దక్కలేదు. అపజయాలతో డీలా పడకుండా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా అఖిల్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో విశేషం ఏంటంటే అఖిల్ కౌబాయ్ గా కనిపిస్తున్నాడు. ఫోటో నేపథ్యం కూడా కౌబాయ్ సినిమాలో చూపించే లొకేషన్ తరహాలోనే ఉంది. మరి ఈ ఫోటో ఎప్పటిది అని మీకు అనుమానం రావచ్చు.

 

ఈ ఫోటో 2002 నాటిది. అప్పట్లో మహేష్ బాబు 'టక్కరి దొంగ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో మహేష్ కౌబాయ్ పాత్రలో కనిపిస్తారు. ఆ సినిమా షూటింగ్ లోకేషన్ కు అప్పట్లో అఖిల్ వెళ్ళాడట. అసలే చిన్నవాడు కావడంతో ముచ్చటపడి కౌబాయ్ హ్యాట్ ధరించి, చేతిలో పొడవాటి గన్ పట్టుకొని ఫోటోకు ముచ్చటగా పోజిచ్చాడు. 16 ఏళ్ల క్రితం నాటి ఫోటో కావడంతో అక్కినేని అభిమానులు ఈ ఫోటోను చూసి మురిసిపోతున్నారు. ఒక నెటిజన్ అఖిల్ ని చూసి 'అక్కినేని టక్కరి దొంగ' అని కామెంట్ చేయడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS