అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న చిత్రం 'హలో' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ధియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల షోలు ముందుగానే పడ్డాయి. అభిమానుల నుండి వస్తున్న రిపోర్ట్ పోజిటివ్‌గానే వస్తోంది. బ్లాక్ మార్కెట్‌లో టికెట్ ధర బాగా పలుకుతోంది. ఇది ఈ సినిమాపై భారీ అంచనాలకు నిదర్శనం. అఖిల్ యాక్టింగ్ టాలెంట్‌ని ఇంతకు ముందే చూశాం. ఈ సినిమాలో మరికొంచెం కొత్తగా, న్యూ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాడు. డాన్సులు, ఫైట్స్‌తో పాటు ఈ సారి కొత్తగా సింగింగ్ టాలెంట్ కూడా చూపించాడు అఖిల్. 'మనం' తర్వాత అక్కినేని ఫ్యామిలీతో విక్రమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది.
బడ్జెట్ పరంగా భారీ సినిమా అనే చెప్పాలి. నాగార్జున ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో అఖిల్‌ని హీరోగా నిలబెట్టేందుకు టీమ్ అంతా పడిన కష్టం, అఖిల్ టాలెంట్ అంతా సినిమాలో కనిపిస్తుందట. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చిరంజీవి సినిమా చూసి, అఖిల్‌ని ప్రశంసలతో ముంచెత్తేశాడు. ఈ సినిమా కోసం అఖిల్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్ స్థాయిలో స్టంట్స్ అందరినీ థ్రిల్‌కి గురి చేసేలా ఉంటాయట. కొత్త భామ కళ్యానీ ప్రియదర్శన్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి తెరంగేట్రం చేస్తోంది.
అలనాటి హీరోయిన్ లిజీ కూతురు కళ్యాణీ. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. అఖిల్‌ని చాలా కొత్తగా చూపించాడట విక్రమ్ కుమార్. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు ఈ సినిమా కోసం. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీ లాంఛింగ్ మూవీగా తెరకెక్కుతోన్న 'హలో' అఖిల్‌కి మంచి సినిమా అవ్వాలని ఆశిద్దాం!