అఖిల్ హీరోగా వస్తోన్న రీ లాంఛింగ్ మూవీ 'హలో' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. యాక్షన్ సన్నివేశాలు బీభత్సంగా కట్ చేశారు ట్రైలర్‌లో. యాక్షన్, ప్రేమ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. తన సోల్ మేట్‌ను కలుసుకోవడానికి ఓ కుర్రాడు ఎంత కష్టపడ్డాడనేది కాన్సెప్ట్. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ వైజ్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దిట్ట.
'మనం' చిత్రాన్ని ఎంత చక్కగా ఆడియన్స్‌కి చేరువయ్యేలా తెరకెక్కించాడో, '24' కాన్సెప్ట్‌ని ఎలా తెరకెక్కించాడో మనందరికీ తెలిసిందే. 'హలో' కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అఖిల్‌లో తొలి సినిమాకి, ఈ సినిమాకీ చాలా ఛేంజ్ వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు ట్రైలర్ చూస్తుంటే. తొలి సినిమాలో హీరోగా అఖిల్ ప్రయత్న లోపం ఏమీ లేదు. తన వంతు చేయాల్సిన ప్రయత్నం చేశాడు. కానీ టైం కలిసి రాలేదంతే. అయితే ఈ సినిమాతో అలా కాదు, అఖిల్ మాయ చేస్తున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మనసును టచ్ చేసే సెంటిమెంట్ కూడా ఉంది.
'బాహుబలి'లో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ ఈ సినిమాలో అఖిల్‌కి తల్లిగా నటిస్తోంది. ఆమె అప్పియరెన్స్ చాలా బాగుంది ట్రైలర్‌లో. టీజర్‌లోలానే నాగార్జున గొంతుతోనే ట్రైలర్ కూడా స్టార్ట్ అయ్యింది. 'మనం'తో సెన్సేషన్ సృష్టించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాతోనూ ఏదో మెస్మరైజ్ చేయనున్నాడనిపిస్తోంది. తొలి సినిమా నిరాశ పరిచినా, అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టేలానే ఉన్నాడు. హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ ఫ్రెష్‌లుక్‌లో క్యూట్‌గా కనిపిస్తోంది ట్రైలర్‌లో. డిశంబర్ 22న 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది.