`ఏజెంట్` అక్కినేని అఖిల్‌!

By iQlikMovies - April 07, 2021 - 09:43 AM IST

మరిన్ని వార్తలు

అఖిల్‌, హ‌లో, మ‌జ్ను.. ఇలా వ‌రుస‌గా మూడు ఫ్లాపులిచ్చాడు అక్కినేని అఖిల్. త‌న దృష్టంతా ఇప్పుడు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`పైనే ఉంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే.. సురేంద‌ర్ రెడ్డి తో ఓ సినిమా ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు అఖిల్. గురువారం ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. గురువార‌మే.. ఫ‌స్ట్ లుక్ తో పాటు, టైటిల్ నీ రివీల్ చేయ‌నున్నారు.

 

ఈ చిత్రానికి `ఏజెంట్` అనే టైటిల్ పెట్టే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. గూఢ‌చారి నేప‌థ్యంలో సాగ‌బోతోంద‌ట‌. అఖిల్ గూఢ‌చారిగా క‌నిపిస్తాడ‌ని, త‌న‌ని అంతా `ఏజెంట్` అని పిలుస్తార‌ని, అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ అదా? కాదా? అనే విష‌యాలు ఇంకొన్ని గంట‌ల్లో తెలిసిపోనున్నాయి. అన్న‌ట్టు ఈచిత్రానికి ఏకంగా 40 కోట్ల బ‌డ్జెట్ కేటాయించార్ట‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అఖిల్ పై 40 కోట్లంటే పెద్ద రిస్కే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS