అక్కినేని రాకుమారుడు వచ్చేస్తున్నాడహో.!

By iQlikMovies - September 17, 2018 - 11:44 AM IST

మరిన్ని వార్తలు

భారీ అంచనాలతో విడుదలైన 'అఖిల్‌' చిత్రం డిజాస్టర్స్‌ లెక్కలోకి వెళ్లిపోవడంతో అక్కినేని అందగాడు అఖిల్‌ ఎంట్రీ సందిగ్ధంలో పడిపోయింది. రెండో సినిమా కోసం చాలా గ్యాప్‌ తీసుకుని ఫ్రెష్‌ ఎంట్రీ అంటూ 'హలో' సినిమాని రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన రిజల్ట్‌ని అందించలేదు కానీ, ముచ్చటగా మూడో సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్‌. 

ఈ సినిమాని డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయని ఈ సినిమాకి 'మిస్టర్‌ మజ్ను' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ నెల 19 న అఖిల్‌ 3 నుండి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ లోగో విడుదల చేయనున్నామని చిత్రయూనిట్‌ తాజాగా ప్రకటించింది. అదే రోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, ఆ రోజే అఖిల్‌ మూడో సినిమా టైటిల్‌ విడుదల చేయడానికి మంచి ముహూర్తంగా అక్కినేని ఫ్యామిలీ భావించిందట. 

ఈ సినిమాలో అఖిల్‌ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది. పక్కా యూత్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. 'తొలిప్రేమ' సినిమాతో రొమాంటిక్‌ హిట్‌ ఇచ్చి దర్శకుడు వెంకీ అట్లూరి సత్తా చాటాడు. ఈ సినిమాతో మరోసారి రొమాంటిక్‌ స్టైల్‌ చూపించబోతున్నాడు. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా నటిస్తోంది. 

తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా అఖిల్‌కి మంచి విజయం అందించాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS