అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 
దర్శకత్వం: నితిన్ భరత్
కథ - రచన: నితిన్ భరత్


నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిషోర్, జీఎం సుందర్, మురళీధర్ గౌడ్, బ్రహ్మనందం, జాన్ తదితరులు


సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్‌రెడ్డి
ఎడిటర్: పవన్ కల్యాణ్ కోదాటి

బ్యానర్: మాంక్స్ అండ్ మంకీస్
విడుదల తేదీ: 11 ఏప్రిల్ 2025  
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

యాంకర్ గా ప్రయాణం మొదలు పెట్టిన ప్రదీప్ మెల్లగా హీరో అయిపోయాడు. మొదట 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో  పర్వాలేదని పించుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో ఢీ షో బ్యూటీ దీపిక పిల్లి, ఢీ, జబర్దస్త్ లాంటి షోలను డైరక్ట్   చేసిన నితిన్ భరత్‌లతో కలిసి ప్రదీప్ చేసిన రెండో ప్రయత్నం ఇది. ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో లేదో? ప్రదీప్ ని హీరోగా నిలబెట్టిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.            


కథ :
తమిళ, ఆంధ్ర సరిహద్దుల్లో భైరి కోన అనే ఊరు ఉంటుంది. ఆ ఊరి పెద్ద రాజన్న (జి.ఎం. సుందర్) ఆ ఊరి కోసం, ఊరి బాగు కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. వారసత్వాన్నీ   వ్యతిరేకిస్తూ అలా ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ ఊర్లో చాలా కాలానికి ఓ ఆడపిల్ల రాజ కుమారి అలియాస్ రాజా (దీపిక పిల్లి) పుడుతుంది. అప్పటి వరకు ఆ ఊరిలో అందరికీ మగపిల్లలే  పుడుతుంటారు. 60 మంది మగపిల్లలతరువాత ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్ల పుట్టిన తరువాత వర్షాలు పడి కరువు మాయం అవుతుంది. దాంతో రాజకుమారిని ఆ ఊరి మహాలక్ష్మీ అని అంతా సంబర పడుతుంటారు. అందుకని ఆ మహాలక్ష్మీని ఊరు దాటనివ్వ కూడదని,  ఊరు దాటితే తమ అదృష్టం కరిగిపోతుంది అని,మళ్ళీ కష్టాలు ఎదురవుతాయని అదే ఊరిలో ఉండే 60 మందిలోని ఎవరో ఒకర్ని పెళ్లి చేసే ఉదేశ్యంతో ఉంటారు ఆ గ్రామ ప్రజలు.  ఈక్రమంలో రాజకుమారి ఎవరిని ఇష్టపడితే వారిని పెళ్లి చేసుకుంటుందని, అలా పెళ్లి చేసుకున్న వాడే ఊరికి ప్రెసిడెంట్ అవుతాడని, తన ఆస్తి మొత్తం అప్పుడు వారికి చెందుతుందని రాజన్నచెప్తాడు. ఇది విన్న ఆ గ్రామ ప్రజలు బయట మగాళ్లని ఎవర్నీ ఆ ఊర్లోకి  రానివ్వరు. అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరిలో బాత్రూమ్స్ కట్టడం కోసం సివిల్ ఇంజనీర్  కృష్ణ (ప్రదీప్ మాచిరాజు), బిలాల్ (సత్య) ఆ ఊరికి వస్తారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలు? కృష్ణకి, రాజాకి పరిచయం ఎలా ఏర్పడుతుంది? వారు ప్రేమికులుగా ఎలా మారుతారు ? చివరకు వారి ప్రేమ గెలిచిందా? లేదా?  కృష్ణ కి రాజకుమారినిచ్చి పెళ్లి చేయటానికి ఆ ఊరి వాళ్ళు ఒప్పుకున్నారా ? ఊరిలో ఉన్న 60 మంది కుర్రాళ్లు పరిస్థితి ఏంటి? తమలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుందని ఆశగా ఉన్న 60 మంది, కృష్ణ - రాజాల ప్రేమ విషయం తెలిశాక ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసు కోవాల్సిందే. 


విశ్లేషణ: 
ప్రదీప్ కామెడీ టైమింగ్ బాగుటుంది. ప్రదీప్ యాంకరింగ్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ప్రదీప్ కి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాన్ బేస్ ఉంది. అవన్నీ దృష్టిలోపెట్టుకుని అదే ఫాలో అయ్యారు దర్శక ద్వయం నితిన్ - భరత్. కథ, కథనం, మాటలు, దర్శకత్వం అన్నీ అదే ఫార్ములా లో ఉన్నాయి. ఈ సినిమా చూసేటప్పుడు చాలా సినిమాలు జ్ఞప్తికి వస్తాయి. 'మర్యాద రామన్న', 'పరుగు', 'రక్షా బంధన్' సినిమాలు తలపిస్తాయి. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' కథలో కామెడీకి పెద్ద పీట వేశారు.  


కథలో కొత్తదనం లేకపోయినా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న నేపథ్యం, కథ, కథనం పూర్తిగా కామెడీగా తెరకెక్కించారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ కొడతాయి. కొన్ని చోట్ల కామెడీ పేలవంగా ఉంది. కథలో కనెక్టివిటీ మిస్ అయ్యింది. ఎమోషన్ కి పెద్దగా ఆస్కారం లేదు. లాజిక్ లేని సీన్స్ చాలా ఉంటాయి. కొంతలో కొంత సత్య, గెటప్ శ్రీను తమ మార్క్ కామిడీతో నవ్విస్తారు. హీరోయిన్ ఇష్టా ఇష్టాలకి ఆస్కారం లేకుండా తన లైఫ్ డిసైడ్ చేసేయటం అన్నది ఒక బాధ. అలాంటి ఎమోషన్ ని సరిగ్గా వాడుకోలేకపోయారు. హీరో హీరోయిన్స్ మధ్య  లవ్ ట్రాక్ రొటీన్ గా ఉంది. ఫస్ట్ హాఫ్‌ చాలా వరకు సత్య, గెటప్ శ్రీను లాక్కోచ్చారు. సెకండాఫ్‌లో సత్యని వాడుకోలేదు. దీనితో  ఎంటర్టైన్మెంట్ లోటు కనిపించింది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రత్యేకంగా చొప్పించినట్టు ఉంటాయి. ఈ సినిమా కోసం ఆడియన్స్  రెండున్నర గంటలు పెట్టడం కష్టమే. ఎలాంటి లాజిక్స్ లేకుండా. ఎమోషన్ కనక్ట్ వీటీ లేకుండా పేలవమైన  కామెడీతో ఒక సినిమా తీయటం జనాల సహనానికి పరీక్షే. 


నటీ నటులు:
ప్రదీప్ మాచిరాజు తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ప్రదీప్ నటన న్యాచురల్ గా ఉంది. ఇంజినీరు కృష్ణ పాత్రలో ప్రదీప్ ఒదిగిపోయి నటించాడు. ఆఫ్ స్క్రిన్ కూడా ప్రదీప్ చలాకీగా ఉంటూ కామెడీ చేస్తుంటాడు. ప్రదీప్ కామెడీ టైమింగ్ పెర్ఫెక్ట్ గా ఉంది. లవ్ సీన్లలో బాగానే నటించాడు. తెలుగు అమ్మాయి దీపిక పిల్లి డీ షో ద్వారా అభిమానుల్ని సంపా దించుకుని ఈసినిమాలో హీరోయిన్ గా మారింది. దీపికా తన పాత్రకి న్యాయం చేసింది. వచ్చిన మొదటి అవకాశాన్ని వినియోగించుకుని పలువురి దృష్టిలో పడింది. ప్రదీప్, దీపిక మధ్య వచ్చే  లవ్ సీన్లలో వీరి కెమిస్ట్రీ బాగుంది.  బిలాల్‌గా సత్య, గెటప్ శ్రీను నవ్వులు పూయించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మనందం తో పాటు మిగితా వారు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 


టెక్నికల్ :
టెక్నికల్‌గా ఈ మూవీకి రధన్ అందించిన పాటలు యావరేజ్ గా నిలిచాయి. సినిమాని కొంత వరకు డిస్ట్రబ్ చేసినట్టు అనిపిస్తాయి.  ఏవి గుర్తు పెట్టుకునే విధంగా లేవు. ఎంఎన్ బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథకి  అనుగుణంగా లొకేషన్లు ఉన్నాయి.  గ్రామీణ వాతావరణాన్ని బాగా ఎలివేట్ చేసారు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.  


ప్లస్ పాయింట్స్ 

ప్రదీప్ 
సత్య , గెటప్ శ్రీను 
ఎడిటింగ్ 
కామెడీ 


మైనస్ పాయింట్స్ 

కథ, కథనం 
పాటలు 
లాజిక్స్, ఎమోషన్స్ మిస్సింగ్   

 

ఫైనల్ వర్దిక్ట్: ఎక్కడా ఆకట్టుకోలేని 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS