నే పాడితే లోకమే పొగడదా!

మరిన్ని వార్తలు

అక్కినేని హీరోల్లో నాగార్జున ఈ మధ్యనే ఓ సినిమాలో పాట పాడాడు. అది 'నిర్మలా కాన్వెంట్‌' సినిమా. అందులో నాగార్జున పాడిన పాటకు మంచి అప్లాజ్‌ వచ్చింది. తండ్రి బాటలోనే తనయుడు కూడా అడుగులేస్తున్నట్టున్నాడు. తండ్రి ప్రోత్సాహమో, మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకోవాలన్న తాపత్రయమో ఏదైతేనేం అక్కినేని అఖిల్‌ ఓ వేదికపై పాట పాడాడన్న వార్త సంచలనంగా మారింది. అది కూడా ప్రతిష్టాత్మక సైమా అవార్డుల వేడుకలో అయితే ఆ కిక్కే వేరు కదా. అక్కినేని అఖిల్‌, సైమా వేడుకలో ఏ పాట పాడాడో తెలుసా? తన కొత్త సినిమాలోని పాట. ఇది ఇంకా పెద్ద సంచలనం. ఇంకా విడుదల కాని సినిమాలోని ఓ పాటను అక్కినేని అఖిల్‌ పాడటమంటే వెరీ వెరీ స్పెషల్‌ న్యూసే. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్‌ పెట్టలేదు. అఖిల్‌ తన పాటతో సైమా వేడుకకు హాజరైనవారిని అలరించాడు. ఆ పాట అక్కినేని అఖిల్‌ అలా పాడుతోంటే, అందరూ ఆశ్చర్యపోయారు. నాగార్జున అయితే పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అఖిల్‌ ఆ పాట పాడేందుకు ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని సోషల్‌ మీడియాలో వెల్లడించారు నాగార్జున. అఖిల్‌ కేవలం నటుడు మాత్రమే కాదు, క్రికెటర్‌ కూడా. కొత్తగా అఖిల్‌ తనలోని సింగింగ్‌ టాలెంట్‌ని బయటపెడ్డం అభినందించదగ్గ విషయం. అందుకే, సినీ ప్రియులంతా అఖిల్‌ టాలెంట్‌ ప్రదర్శించడాన్ని ఆహ్వానిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS