సూర్య పాత్ర‌లో అక్ష‌య్‌?

By Gowthami - July 22, 2021 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

సౌత్ సినిమాల‌పై బాలీవుడ్ మ‌మ‌కారం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇక్క‌డ ఏవ‌రేజ్ గా ఆడిన సినిమాల్నీ వ‌ద‌ల‌డం లేదు. రీమేక్‌లుగా బాలీవుడ్ కి తీసుకెళ్లిపోతున్నారు. తాజాగా వాళ్ల దృష్టి `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` సినిమాపై ప‌డింది. సూర్య న‌టించిన `సూరారై పోట్రు` ఆకాశం నీ హ‌ద్దురా పేరుతో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సుధా కొంగ‌ర‌నే బాలీవుడ్ చిత్రానికీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది.

 

ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. ఇప్పుడు సూర్య పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. ఇటీవ‌లే `సురారై పోట్రు`ని అక్ష‌య్ చూశాడ‌ట‌. `ఈ సినిమా చేస్తా` అంటూ నిర్మాత‌ల‌కు మాట ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. త‌మిళంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో మోహ‌న్ బాబు న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర‌లో ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. నిజానికి.. మోహ‌న్ బాబు పాత్ర చాలా చిన్న‌ది. ఇప్పుడు ఆ పాత్ర నిడివి, ప్రాధాన్యం పెంచి కొత్త‌గా డిజైన్ చేస్తున్నార‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS