అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం డీజే - దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈనెల 23న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు టీజర్ ని వదులుతున్నారు. ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు డీజే ట్రైలర్‌ని వదలడానికి రంగం సిద్ధం చేసుకొంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. టీజర్‌తో అవి రెట్టింపు అయ్యాయి. మరి ట్రైలర్.. డీజేపై హోప్స్‌ని ఏ స్థాయిలోకి తీసుకెళ్తుందో చూడాలి. ఇటీవల విడుదల చేసిన ఓ పాటపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. ఆ వివాదం కొనసాగుతుండగానే ట్రైలర్ వచ్చేస్తోంది. మరి ట్రైలర్ చూశాక... వాళ్లేమైనా శాంతిస్తారేమో చూడాలి.