ఐకాన్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టే!

By iQlikMovies - June 16, 2021 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఐకాన్‌... ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో న‌లుగుతున్న టైటిల్ ఇది. అల్లు అర్జున్ కోసం... వేణు శ్రీ‌రామ్ ఈ స్క్రిప్టు త‌యారు చేసుకుని, ఏళ్ల త‌ర‌బ‌డి తిరుగుతూనే ఉన్నాడు. అప్ప‌ట్లో బ‌న్నీ ఓకే అన్నా - ధైర్యం స‌రిపోక‌... ప‌క్క‌న పెట్టేశాడు. ఇంత‌లో వేణు కి `వ‌కీల్ సాబ్` ఆఫ‌ర్ దొరికింది. వ‌కీల్ సాబ్ తో హిట్టు కొడితే, క‌చ్చితంగా బ‌న్నీ నుంచి మ‌ళ్లీ పిలుపు వ‌స్తుంద‌ని తెలుసు. అందుకే మ‌రింత క‌సిగా... వ‌కీల్ సాబ్ తీశాడు.

 

ఈ సినిమా హిట్ట‌వ్వ‌డంతో, మ‌ళ్లీ ఐకాన్ పై ఆశ‌లు చిగురించాయి. దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కించ‌డానికి త‌న వంతు విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ.. బ‌న్నీ బ‌న్నీ హ్యాండ్ ఇచ్చాడ‌ని వార్త‌లొచ్చాయి. దాంతో.. ఈ క‌థ ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిందని, అటూ ఇటూ తిరిగి... ఈ క‌థ‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని చెప్పుకున్నారు.

 

అయితే ఇంత‌లో క‌థ మ‌రో మ‌లుపు తిరిగింది. అల్లు అర్జున్ నుంచి.. వేణు శ్రీ‌రామ్ కి మ‌ళ్లీ పిలుపొచ్చింది. `ఐకాన్ చేసేద్దాం రా` అంటూ బ‌న్నీ క‌బురెట్టిన‌ట్టు న‌ట్టు టాలీవుడ్ టాక్‌. `పుష్ఫ‌` త‌ర‌వాత ఎలాంటి సినిమా చేయాలా? అనే సందిగ్థంలో బ‌న్నీ ఉన్నాడు. కొన్ని క‌థలు కూడా విన్నాడు. కానీ అవేం న‌చ్చ‌క‌పోవ‌డంతో, ఐకాన్‌పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఐకాన్ లాంటి క‌థే ఎంచుకోవ‌డం బెట‌ర్ అని... వేణు భావిస్తున్నాడ‌ట‌. ఈసారి ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డం వంద శాతం ప‌క్కా అని, దీన్ని పాన్ ఇండియా మూవీగా సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS