'కింగ్' నాగార్జున కదా. అల్లు అర్జున్‌ని కింగ్ అంటున్నారేంటి. ఏంటీ కొత్త కథ అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. అల్లు అర్జున్ హీరోగా 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' అంటూ 'డీజె' చిత్ర యూనిట్ ఓ స్టిల్‌ని రిలీజ్ చేసింది. ఈ స్టిల్పైనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్‌ని కింగ్ అని ఎలా అంటారు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలు జరిగేది బన్నీపైనే. ఎందుకంటే సోషల్ మీడియాలో బన్నీని ఇష్టపడేవాళ్లు ఎంత మంది ఉన్నారో హేట్ చేసేవాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ రెండు రకాల వర్గాలుగా విడిపోయారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు. నిజానికి బన్నీకే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. అంతేకాదు బన్నీకి టాలీవుడ్లోనే కాకుండా, మల్లూవుడ్‌లో కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్తోనే సోషల్ మీడియాలో బన్నీకి ఫాలోవర్స్ ఎక్కువే. సో ఏ రకంగా చూసుకున్నా, సోషల్ మీడియాకి కింగ్ బన్నీనే అని చెప్పక తప్పదు. ఏదో రకంగా బన్నీ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. 'డీజె' ఫస్ట్‌లుక్ దగ్గర నుండి, ప్రచార చిత్రం వరకూ సోషల్ మీడియాలో క్రియేట్ అయిన రికార్డులు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. అదే మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే. జూన్ 23న అల్లు అర్జున్ 'డీజె'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది.