మహేష్‌బాబుపై అల్లు అర్జున్‌దే పై చేయి.!

By Inkmantra - January 16, 2020 - 09:38 AM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతి సినిమాలు ఈసారి ప్రేక్షకులకి నిజంగానే పెద్ద పండగని తీసుకొచ్చాయి. రెండు పెద్ద సినిమాలు.. ఈసారి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. వస్తూనే, రెండూ.. సంచలన విజయాల్ని అందుకున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తొలి రోజు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తే, 'అల వైకుంఠపురములో' బ్లాక్‌బస్టర్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. పండగ సీజన్‌ కావడంతో టాక్‌తో సంబంధం లేకుండా సినిమాల వసూళ్ళు వుంటాయన్నది అందరికీ తెల్సిన విషయమే. అయితే, రెండూ పెద్ద సినిమాలు కావడంతో.. సినీ అభిమానులు మరింతగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎక్స్‌ట్రా థియేటర్స్‌.. మళ్ళీ వాటిల్లో ఎక్స్‌ట్రా ఛెయిర్స్‌.. ఇలా సాగుతోంది సినిమా పండుగ.

 

ఓవర్సీస్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు సినిమాలూ వసూళ్ళు దుమ్ము రేపేస్తున్నాయి. అయితే, ఎలా చూసినా అల్లు అర్జున్‌దే, మహేష్‌బాబుపై పై చేయిగా కన్పిస్తోందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఓవర్సీస్‌లో వసూళ్ళకు సంబంధించి ఈ విషయం ఇప్పటికే స్పష్టమయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ళ పరంగా చూస్తే అల్లు అర్జున్‌, మహేష్‌ మీద పై చేయి ప్రదర్శిస్తున్నట్లే కన్పిస్తోంది. మరోపక్క, అభిమానులు మాత్రం రెండు చిత్రాల మధ్యా పోలికని జుగుప్సాకరంగా మార్చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేసేస్తున్నారు. షేర్స్‌ పరంగా 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరూ' ఇప్పటికే 50 కోట్ల ఫిగర్‌ దాటేసి, 75 కోట్ల వైపుకు దూసుకుపోతున్న విషయం విదితమే. రెండు సినిమాలూ మంచి విజయాల్ని అందుకున్నందుకు ఆయా హీరోలు సంతోషించాలి తప్ప.. జుగుప్సాకరమైన ఫైట్‌ సోషల్‌ మీడియాలో చేయడమెందుకట.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS