'నా పేరు సూర్య' శాటిలైట్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా టీజర్ ఈ మధ్యనే విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది.

ఒక విధంగా చెప్పాలంటే - ఈ టీజర్ వల్ల 'నా పేరు సూర్య' చిత్రం పైన విపరీతమైన క్రేజ్ రావడమే గాక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. దానికి ఉదాహరణే ఈ చిత్రం తాలుకా శాటిలైట్ రైట్స్ (హిందీ వెర్షన్ రైట్స్ కలుపుకుని) సుమారు రూ. 28 కోట్లకి అమ్ముడవ్వడం జరిగింది.

దీనిబట్టి ఈ చిత్రం పైన ఎంత నమ్మకంగా ఉన్నారన్న సంగతి అర్ధమైపోతుంది. ఇక ఈ సినిమా తో తొలిసారిగా దర్శకుడిగా మారుతున్నాడు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ.

ఇక ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. చూద్దాం.. ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS