టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. బన్నీ క్రేజ్ ని వరల్డ్ స్థాయికి తీసుకెళ్లటమే కాకుండా, రికార్డ్ స్థాయిలో కలక్షన్స్ సాధించింది. ఇప్పడు సెకండ్ పార్ట్ కూడా అదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప మొదటి పార్ట్ క్రేజ్ వలన సెకండ్ పార్ట్ కి మంచి బిజినెస్ జరుగుతోంది. 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకుంది. సెకండ్ పార్ట్ ఎవరు దక్కించుకుంటారు అని అంతా ఎదురుచూస్తున్న క్రమంలో కళ్ళు చెదిరే రేట్ కి డిజిటల్ డీల్ క్లోజ్ అయ్యింది.
‘పుష్ప 2’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. 275 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్‌తో నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మొదటి నుంచి పోటీలో ఉన్నాయి. కానీ భారీగా డిమాండ్ చేయటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో తప్పుకుంది. మొదటి పార్ట్ రైట్స్ కి సెకండ్ పార్ట్ రైట్స్ కి చాలా వేరియేషన్ ఉంది. డిజిటల్ రైట్స్ కి 275 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు సౌత్ లో ఇదే హయ్యెస్ట్ అని చెప్పాలి.
బాహుబలి, RRR ల కంటే కూడా పుష్ప 2 డిజిటల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడు అయ్యాయి. సినిమా రిలీజ్ ముందే బన్నీ ఇన్ని కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవుతాయేమో చూడాలి.