'చరణ్ అర్జున్' అనే టైటిల్‌తో రామ్‌చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. ఇదంతా 'ఎవడు' సినిమా తర్వాతి సంగతి. ఆ సినిమానే ఓ మల్టీస్టారర్‌గా చెప్పవలసి ఉంటుంది. చేసింది చిన్న పాత్రే అయినా, ఆ సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ సినిమాపై చాలా ఇంపాక్ట్ చూపించింది. చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రమది. ఈ కాంబినేషన్‌లోనే ఇంకో మల్టీస్టారర్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు కూడా చేశారు. అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పట్టాలెక్కలేదు. అయితే అతి త్వరలో ఈ కాంబినేషన్‌ని మళ్ళీ తెరపై చూపించడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారమ్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందిట. దీనికోసం చరణ్, అల్లు అర్జున్‌తో సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలియవస్తోంది. ఈ ఏడాది చివరినాటికి సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని సినీ వర్గాల్లో గాసిప్స్ వినవస్తున్నాయి. 'ఎవడు'లో గెస్ట్ రోల్‌లో నటించినట్లుగా కాకుండా, అల్లు అర్జున్ పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండబోతోందట. ఈక్వల్ ఇంపార్టెన్స్‌తో ఈ సినిమా 'స్టైలిష్ మెగా పవర్' అనే స్థాయిలో రూపొందనుందని వినవస్తున్న గాసిప్స్ నిజమైతే అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది?