స్టైలిష్ స్టార్అల్లు అర్జున్ ఏం చేసినా అందులో ఏదో ఒక స్పెషాలిటి చూపించడానికి ప్రయత్నించే హీరో!
అలాగే తన కొత్త చిత్రానికి కూడా ఒక పొడుగు టైటిల్ పెట్టి అందరిని షాక్ గురిచేశాడు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయేది పాపులర్ రైటర్ వక్కంతం వంశీ, ఇక ఈ టైటిల్ ఏంటంటే- నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా..
ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ తన బ్యానర్ లో నిర్మించబోతున్నాడట. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం దువ్వాడ జగన్నాధం సినిమా షూటింగ్ తర్వాత మొదలవ్వనుంది అని టాక్.
మంచి కమర్షియల్ సినిమాలకి సూపర్ హిట్ కధలు అందించిన వంశీ ఇప్పుడు మరి తాను డైరెక్ట్ చేయబోయే సినిమాకి ఇంకెలాంటి కధ అందిస్తాడో వేచి చూడాలి.