అల్లు శీరీష్.... టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడానికి సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. అయితే ఇప్పటి వరకూ తగిన ఫలితం రాలేదు. 5 సినిమాలు చేస్తే.. ఐదూ.. ఫట్టే. ఈసారి ఎలాగైనా సరే, హిట్టు కొట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈరోజు అల్లు శిరీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్, పోస్టర్ విడుదలయ్యాయి.‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో శిరీష్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అనూ ఇమ్మానియేల్ కథానాయిక. ఈ చిత్రానికి `ప్రేమ కాదంట` అనే పేరు ఖరారు చేశారు. పోస్టర్‌ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం పక్కా రొమాంటిక్ యాంగిల్‌లో రూపొందుతుందని అర్ధమవుతుంది. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త దృక్పథాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు.