నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ రెండు సినిమాలొచ్చాయి. రెండూ సూపర్ హిట్లే. ఇప్పుడు మూడో సినిమా సెట్స్ పై ఉంది. లాక్ డౌన్‌కి ముందు కొంత మేర షూటింగ్ జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలెడతారు. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ముంబై నుంచి ఓ కొత్తమ్మాయిని తీసుకురావాలన్నది బోయపాటి ప్రయత్నం. కానీ ఇప్పటి వరకూ.. హీరోయిన్‌ని ఎంచుకోలేదు. ఇప్పుడు తెలిసిన కథానాయినే తీసుకుంటే నయం అనే నిర్ణయానికి వచ్చార్ట. అందులో భాగంగా అమలాపాల్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఇద్దరమ్మాయిలు, నాయక్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది అమలా. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. సినిమాల్ని చాలా ఆచి తూచి ఎంచుకుంటోంది. బాలయ్యతో సినిమా. పైగా బోయపాటి కాంబినేషన్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అవకాశాన్ని అమలాపాల్ వదులుకునే ఛాన్సే లేదు. త్వరలోనే అమలా ఎంట్రీ గురించి ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.