నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం నటి అమలా పాల్ కీ అలవాటుగా మారినట్టుంది!
మొన్నీమధ్యనే డైరెక్టర్ విజయ్ తో తన మాంగల్య బంధానికి గుడ్ బై చెప్పిన విషయం తెరమరుగవ్వకముందే మళ్ళీ కొత్త వివాదంలో అమలా చిక్కుకుంది.
తెలుస్తున్న వివరాల ప్రకారం, అమలా కొన్ని యోగా ఫోటో షూట్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టింది. అయితే ఆ ఫోటోలలో తన కాళ్ళు గోడపై ఉన్న బుద్ధునికి తగులుతున్నాయని, ఇది బుద్ధుడిని అవమానించే పద్దతిలో ఉన్నాయని కొన్ని వర్గాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
అసలే మీడియా హడావిడి ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు ఎంత హైలైట్ అవ్వాలో అంత అవుతున్నాయి. ఇప్పటివరికైతే, అమలా ఈ అంశం పై స్పందించలేదు.