నిన్ననే 75వ వసంతంలోకి అడుగుపెట్టిన లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, తన పుట్టినరోజుని నిరాడంబరంగా తన కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నాడు.
అయితే దీనికి గల కారణాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ పోస్ట్ లో ఆయన ఏం చెప్పారంటే- 75 సంవత్సరాలు అంటే ఒక మనిషి జీవితంలో చరమాంకంగా భావిస్తారు. అట్లాంటిది, ఈ వయసులో తనకి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లాంటివి ఇబ్బందిగా ఉంటాయి అని తన మనసులో మాట చెప్పాడు.
ఇదే క్రమంలో తన జీవితంలోని అనేక తీపి గుర్తులని తన కుటుంబసభ్యులు మధ్య కూర్చొని వారి ద్వార వినడం చాలా భావోద్వేగానికి గురిచేసే అంశం అని చెప్పాడు. ఇందుకే తాను పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.