చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారన్న వార్తయితే... టాలీవుడ్లో గత వారం రోజులుగా తీవ్ర స్థాయిలో చక్కర్లు కొడుతూనే ఉంది. బాహుబలి స్ఫూర్తితో ఉయ్యాల వాడని బాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి చిరు, చరణ్‌లు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో కనిపిస్తే.... ఉయ్యాల వాడకు మరింత క్రేజ్ వస్తుందని చిరు భావిస్తున్నాడు. అందుకే.. బిగ్ బీతో మాట్లాడి, ఓ పాత్ర కోసం ఆయన్ని ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే... ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అమితాబ్‌ని ఇప్పటి వరకూ చిత్రబృందం కలవలేదట. అసలు ఉయ్యాల వాడ గురించి చర్చించనే లేదట. ఇటీవల బాలకృష్ణ - కృష్ణవంశీల సినిమా `రైతు` కోసం బిగ్ బీని సంప్రదిస్తే.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. సో... చిరుకీ అలాంటి అనుభవమే ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఆ భయంతోనే ఇప్పటి వరకూ అమితాబ్‌ని సంప్రదించలేదని, ఈ సినిమాపై వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని చెబుతున్నారిప్పుడు.