రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' సినిమా సాధించిన ఘనత మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'సర్కార్ 2' కూడా అదే స్థాయిలో విజయం సాధించింది. తాజాగా 'సర్కార్ 3' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'సర్కార్' వచ్చి చాలా కాలమే అయినా కానీ ఆ ఫ్లేవర్ ఏమాత్రం తగ్గకుండా మరో సారి తన సత్తా చాటింది ఈ సినిమా. ఈ సినిమా గొప్పతనం కన్నా ముందుగా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అమితాబ్ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'సర్కార్' విజయం అంటే నటుడిగా అమితాబ్ సాధించిన విజయమే అని చెప్పాలి. 'సర్కార్' అంటే అమితాబ్, అమితాబ్ అంటే సర్కార్ అన్నంతగా ఆ పాత్రకి పేరు తెచ్చిపెట్టారు అమితాబ్. ఇంత వయసులోనూ 'సర్కార్ 3'లో అద్భుతమైన నటన కనబరిచారు. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి ఈ సినిమాకి. పోజిటివ్ టాక్‌తో రికార్డులు సృష్టించేలా ఉంది ఈ సినిమా. గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో అమితాబ్ నటన మరింత ఆకట్టుకునేలా ఉంది. ఈ వయసులో కూడా అమితాబ్ తన నటనతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్నారు. గత సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా అమితాబ్ తన అనుభవాన్నంతా రంగరించి నటించారు ఈ సినిమాలో. అందుకే ఆయన గాడ్ ఫాదర్ అయ్యారు. అమిత్ సాద్, సుప్రియా పాఠక్, మనోజ్ బాజ్‌పాయ్, జాకీష్రాఫ్, రోనిత్ రాయ్, పరాగ్, యామీ గౌతమ్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో.