ఇది క్లియర్.. అమ్మ రాజశేఖర్ విషయంలో బిగ్‌బాస్ బృందం ఓ ఖచ్చితమైన అవగాహనతో వుంది. ఇది చాలామంది చాలా చాలా ముందే ఊహించారు. ఏ వారానికి ఆ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడనే ప్రచారం జరుగుతున్నా, ఆయన మాత్రం హౌస్‌లో కొనసాగుతున్నాడు. అత్యద్భుతమైన బంపర్ ఆఫర్స్ అమ్మ రాజశేఖర్‌కి ఎందుకు లభిస్తున్నాయి.? ఈ విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అమ్మ రాజశేఖర్ ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్.. అతనికి బోల్డంతమంది అభిమానులూ వుండేవారు. కానీ, క్రమంగా అతని పేరుని చాలామంది మర్చిపోయారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయ్యాక కూడా అతన్ని చాలామంది లైట్ తీసుకున్నారు. ఇన్ని రోజుల్లో కంటెస్టెంట్‌గా అమ్మ రాజశేఖర్ సత్తా చాటింది లేదు. డాన్సులూ పెద్దగా చేయలేదు. కామెడీ సంగతి సరే సరి. అన్నిటికీ మించి అమ్మ రాజశేఖర్ లాంగ్వేజ్ చాలా ఇబ్బందికరంగా మారింది వ్యూయర్స్‌కి. ఆయనేం మాట్లాడుతున్నాడో వ్యూయర్స్‌కి అర్థం కావడంలేదు.
ఇన్ని సమస్యలు అతని విషయంలో వున్నాగానీ, అస్సలు ఎలిమినేషన్‌లోకి వెళ్ళట్లేదు. ఎప్పుడో రెండు మూడు వారాల్లోనే ఔట్ అయిపోవాల్సిన క్యాండిడేట్.. ఇప్పటిదాకా వచ్చేశాడు. టాప్ ఫైవ్‌లో కూడా ఖచ్చితంగా అమ్మ రాజశేఖర్ వుండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏమో, ఈసారి టైటిల్‌ని తన్నుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదా.? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. నాగ్ ఇలాగే సపోర్ట్ కొనసాగిస్తే అది పెద్ద కష్టమేమీ కాదు.