బ్రిటీష్ భామ అమీజాక్సన్‌కి అందాల ఆరబోతలో ఎప్పుడూ అలసట ఉండదు పాపం. ఆ మాటకొస్తే, అమ్మయినా కూడా అందాల దాడి ఆపడం లేదు. ఆ మధ్య బేబీ బంప్‌తో ఈ ముద్దుగుమ్మ చేసిన ఎక్స్‌పోజింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు డెలివరీ అయిపోయింది. పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని చెప్పేటప్పుడు కూడా గ్లామర్ అప్పీల్ వీడలేదీ హాట్ బ్యూటీ. ఇక ఇప్పుడు అమ్మయ్యాకా మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న అమీజాక్సన్ లేటెస్ట్‌గా ఓ పిక్ పోస్ట్ చేసింది. రెడ్ కలర్‌లో సింగిల్ పీస్ బికినీ ధరించి ఫోటోకి పోజిచ్చింది.
ఇక్కడ ట్విస్టేంటంటే, జూనియర్ అమీజాక్సన్ కూడా ఈ ఫోటో షూట్‌లో పాల్గొంది. ముద్దుగా బొద్దుగా ఉన్న తన నెలల వయసు పాపను ఎత్తుకుని అమీజాక్సన్ ఈ ఫోటో షూట్ చేయించుకుంది. బ్యాక్ గ్రౌండ్‌లో గ్రీనరీ కనిపిస్తోంది. వాలుగా ఉన్న ఓ చెట్టుపై పడుకుని, తన పొట్టపై పాపని నిలబెట్టుకుని అమీ ఈ యమ్మీ పోజిచ్చింది. అమీ, పాపని చూస్తుంటే, పాప మాత్రం నేనేం తక్కువ కాదు, నేనూ మా అమ్మలాగే.. అన్నట్లు అందరూ నన్ను చూస్తున్నారా.? లేదా.? అన్నట్లు డైరెక్ట్‌గా ఫోటోకి పోజిచ్చింది. బర్త్‌డే నాడు అమీ అమ్మ ఇచ్చిన ఈ గ్లామర్ ట్రీట్ పోలా.. అదిరిపోలా.!